ఇదిగో దేవా నా జీవితం

ఇదిగో దేవా నా జీవితం - ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం  - శరణం నీ చరణం (2)            ||ఇదిగో||

1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో - నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా - ఈ నా శేష జీవితం        ||ఇదిగో||

2.నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో||

3.విస్తార పంట పొలము నుండి - కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు - కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్ - నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా  ||ఇదిగో|| Idigo devaa naa jeevitam - aapaadamastakam neekankitam (2) Sharanam nee charanam - sharanam nee charanam (2) ||idigo|| 1.palumaarlu vaidolaginaanu - paraloka darshanamunundi Viluvaina nee divya pilupuku - ne taginatlu jeevinchanaiti (2) Ayinaa nee premato - nannu daricherchinaavu Anduke gaikonumu devaa - ee naa shesha jeevitam ||idigo|| 2.nee paadamula chenta cheri - nee chittambu neneruga nerpu Nee hrudaya bhaarambu nosagi - praarthinchi panicheyanimmu (2) Aagipoka saagipovu - priyasutunigaa panicheyanimmu Prati chota nee saakshigaa - prabhuvaa nannundanimmu ||idigo|| 3.vistaara panta polamu nundi - kashtinchi pani cheya nerpu Kanneetito vittu manasu - kalakaalam mari naaku nosagu (2) Kshema kshaama kaalamainaa - ninnu ghanaparachu batukunimmayyaa Nashiyinche aatmalan - nee dari cherchu krupanimmayyaa ||idigo||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు