ఇన్నాళ్లు మాకు సాయమై

1. ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా
    యున్నత గృహ మండవై - యొప్పెడు దైవమా !


2. ఏలాటి యీతి బాధయు - నీవచ్చు యేటిలో
    కలుగకుండ బ్రోవవే - ఘనంపు ప్రేమతో


3. నీ సింహాసన నీడలో - నిలుచు భక్తులు
    భయంబు చింతబాధలన్ జయించి మనురు


4. చరాచరంబు లెల్లను జనించుకంటె మున్
    దరతరాల నుండియున్ - నీ రాజ్య ముండెడున్


5. ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచు గాచిన
    ఉన్నత ప్రభు ప్రేమతో - మన్నించు మింకనున్

1. innaallu maaku saayamai yee mundukunu maa yunnata gruha mandavai - yoppedu daivamaa ! 2. elaati yeeti baadhayu - neevachchu yetilo kalugakunda brovave - ghanampu premato 3. nee sinhaasana needalo - niluchu bhaktulu bhayambu chintabaadhalan jayinchi manuru 4. charaacharambu lellanu janinchukante mun darataraala nundiyun - nee raajya mundedun 5. innaallu maaku saayamai yeluchu gaachina unnata prabhu premato - manninchu minkanun

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు