ఇదియే సమయంబు

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయం లేదండి రండి రక్షణ పొందండి


1 పాపులనందరిని తన దాపున చేర్చుటకై
  ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా
  మరణపు ముల్లును విరచి విజయము నిచ్చెనుగా ॥ఇక॥


2 రాజులకు రాజైన యేసు రానై యుండెనుగా
  గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
  తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ॥ఇక॥


3. బుద్ధిలేని కన్యకల వలె మొద్దులుగా నుంటే
    సిద్దెలలోన నూనె పోసి సిద్ధపడకపోతే
  తలుపులు తట్టినను మీకు తెరువడు నమ్మండి ॥ఇక॥ 


4. వెలుపట నుంటేను మీరు వేదన నొందెదరు
    తలుపులు తట్టినను మీరు తెరువడు నమ్మండి
    మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును ॥ఇక॥ 


5. నమ్మినవారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా-
  నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా

    నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ నొందండి ॥ఇక॥ Idiye samayambu randi yesuni jerandi Ika samayam ledandi randi rakshana pondandi 1 paapulanandarini tana daapuna cherchutakai praanamu daanamugaa tana praanamunichchenugaa maranapu mullunu virachi vijayamu nichchenugaa ॥ika॥ 2 raajulaku raajaina yesu raanai yundenugaa gurutulu jarigenugaa meeru sarigaa choodandi tarunamundagaane meeru tayyaaravvandi ॥ika॥ 3. buddhileni kanyakala vale moddulugaa nunte siddelalona noone posi siddhapadakapote talupulu tattinanu meeku teruvadu nammandi ॥ika॥ 4. velupata nuntenu meeru vedana nondedaru talupulu tattinanu meeru teruvadu nammandi mimmunu eruganu meerevaro pommanunu ॥ika॥ 5. namminavaariki kreestu nemmadi nichchunugaa- nammani vaariki nitya narakamu tappadugaa nirlakshyamu cheyakanu randi rakshana nondandi ॥ika॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు