దేవుని ఆలయము
దేవుని ఆలయము పరిశుద్ధాత్ముని నిలయము
కూడెదము వేడెదము ప్రభునిలు పూజింతుము (2)
1. క్రీస్తేసు మూలరాయిగను అపొస్తలు పునాది మీద
కట్టబడి ప్రభువు నందు దేవాలయమగును ||దేవుని||
2. సజీవమైన రాళ్లనుండి - ఆత్మ సంబంధమౌ మందిరము
అమర్చబడి ప్రభువునందు - అభివృద్ధి పొందుచున్నది ||దేవుని॥
3. దేహము దేవుని ఆలయము - దేవుడు మలచిన మందిరము
ఆత్మతోను సత్యముతో ఆరాధించెదము ॥దేవుని॥
4. జీవించువాడు క్రీస్తేసే - జీవన జ్యోతి ఆయనే
నీతితోను విశ్వాసముతో యేసుతో సాగెదము ||దేవుని॥
Devuni aalayamu parishuddhaatmuni nilayamu
Koodedamu vededamu prabhunilu poojintumu (2)
1. kreestesu moolaraayiganu apostalu punaadi meeda
kattabadi prabhuvu nandu devaalayamagunu ||devuni||
2. sajeevamaina raallanundi - aatma sambandhamau mandiramu
amarchabadi prabhuvunandu - abhivruddhi ponduchunnadi ||devuni॥
3. dehamu devuni aalayamu - devudu malachina mandiramu
aatmatonu satyamuto aaraadhinchedamu ॥devuni॥
4. jeevinchuvaadu kreestese - jeevana jyoti aayane
neetitonu vishvaasamuto yesuto saagedamu ||devuni॥
Comments
Post a Comment