దేవుని వారసులం ప్రేమ నివాసులము
దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం
యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము - హల్లెలూరు
1. దారుణ హింసలలో దేవుని దూతలుగా - ఆరని జ్వాలలలో ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము ll దేవుని ll
2. పరిశుద్ధాత్మునికై ప్రార్ధన సలుపుదము పరమాత్ముని రాక బలము
ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై - సర్వాంగ హోమము జేయుదుము ll దేవుని ll
3. అనుదిన కూటములు అందరి గృహములలో
అనందముతోను ఆరాధనలవగ - వీనుల విందగు పాటలతో (2)
ధ్యానము చేయుచు మురియుదము ll దేవుని ll
4. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం
విధేయ బోధకులం - నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదము ll దేవుని ll
5. గోధుమగింజవలె క్రీస్తుడు చావగను
నాధుని మరణములో శాశ్వత జీవమును
నిధులుగ పండించి లేవగను (2) మాధుర్య రక్షణ లభియించె ll దేవుని ll
6. హతసాక్షుల కాలం - అవనిలో చెలరేగ - గతకాలపు సేవ - గొల్గొత గిరిజేర
భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము ll దేవుని ll
7. ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా - విభు మహిమనుగాంచ - విశ్వమే
మముగోర శుభములు గూర్చుచు మాలోనా శోభిల్లు యేసుని కీర్తింతుము ll దేవుని ll
Devuni vaarasulam prema nivaasulamu
jeevana yaatrikulam
Yesuni daasulamu navayuga sainikulam
paraloka paurulamu - hallelooru
1. daaruna hinsalalo devuni dootalugaa -
aarani jvaalalalo aagani jayamulato
maarani prema samarpanato
sarvatra yesuni keertintumu ll devuni ll
2. parishuddhaatmunikai praardhana
salupudamu paramaatmuni raaka balamu
prasaadimpa dharanilo prabhuvunu jooputakai -
sarvaanga homamu jeyudumu ll devuni ll
3. anudina kootamulu andari gruhamulalo
anandamutonu aaraadhanalavaga -
veenula vindagu paatalato (2)
dhyaanamu cheyuchu muriyudamu ll devuni ll
4. sajeeva siluva prabhu samaadhi
geluchutache vijeta premikulam
vidheya bodhakulam - nijamuga rakshana prabalutakai
dhvajamuga siluvanu nilupudamu ll devuni ll
5. godhumaginjavale kreestudu chaavaganu
naadhuni maranamulo shaashvata jeevamunu
nidhuluga pandinchi levaganu (2)
maadhurya rakshana labhiyinche ll devuni ll
6. hatasaakshula kaalam - avanilo chelarega -
gatakaalapu seva - golgota girijera
bheetulalo bahureetulalo
nootana lokamu kaankshintumu ll devuni ll
7. prabhuvunu choochutakai prajalandaru raagaa -
vibhu mahimanugaancha - vishvame
mamugora shubhamulu goorchuchu
maalonaa shobhillu yesuni keertintumu ll devuni ll
Comments
Post a Comment