దేవుని ప్రేమ యిదిగో
దేవుని ప్రేమ యిదిగో - జనులార - భావంబునం దెలియరే =
కేవలము నమ్ముకొనిన - పరలోక జీవంబు మన కబ్బును
1. సర్వలోకము మనలను - తన వాక్య-సత్యంబుతో జేసెను=
సర్వోపకారు డుండే - మన మీద - జాలిపరుడై యుండెను ll దేవుని ll
2. మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను=
మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపముకు దూరుడే ll దేవుని ll
3. యేసుక్రీస్తను పేరున - రక్షకుడు వెలసి నాడిలలోపల =
దోసకారి జనులతో - నెంతో సు-భాషలను బల్కినాడు ll దేవుని ll
4. పాపభారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి =
పాపులందఱు నమ్మిన - విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
5. సతులైన పురుషులైనన్ - యా కర్త సర్వ జనుల యెడలను =
సత్ప్రేమగ నడిచెను - పరలోక సద్బోధలిక జేసెను ||దేవుని॥
6. చావు నొందిన కొందరిన్ - యేసుండు - చక్కగా బ్రతికించెను =
సకల వ్యాధుల రోగులు - ప్రభునంటి - స్వస్థంబు తామొందిరి ||దేవుని||
7. గాలి సంద్రపు పొంగులన్ - సద్దణపి - నీళ్లపై నడచినాడే =
మేలు గల యద్భుతములు - ఈలాగు వేలకొలదిగ జేసెను ||దేవుని||
8. చేతుల కాళ్లలోను - రారాజు - చేర మేకులు బొందెను =
పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్ ॥దేవుని||
9. ఒడలు రక్తము గారగ - దెబ్బలు - చెడుగు అందరు గొట్టిరి =
వడిముళ్లు తలమీదను - బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
10. ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాప పాప నరులను =
మన్నించు మని తండ్రిని - యేసుడు సన్నుతితో వేడెను ll దేవుని ll
11. రక్షకుడు శ్రమ బొందగా - దేశంబు తక్షణము చీక టయ్యెస్ =
రక్షకుడు మృతి నొందగ - తెర చినిగి - రాతి కొండలు పగిలెను ||దేవుని||
12. రాతి సమాధిలోను - రక్షకుని నీతిగల దేహంబును =
పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందరు జూడగా ||దేవుని॥
13. మూడవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాడు=
నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్ ||దేవుని||
14. పదునొకండు మారులు - వారలకు - బ్రత్యక్షు డాయె నేసు=
పరలోకమున కేగెను - తన వార్త- బ్రకటించుమని పల్కెను ||దేవుని॥
15. నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును =
నమ్మనొల్లక పోయెడు - నరులకు నరకంబు సిద్ధమనెను ||దేవుని||
Devuni prema yidigo - janulaara - bhaavambunam deliyare =
kevalamu nammukonina - paraloka jeevambu mana kabbunu
1. sarvalokamu manalanu - tana vaakya-satyambuto jesenu=
sarvopakaaru dunde - mana meeda - jaaliparudai yundenu ll devuni ll
2. maanavula rakshimpanu - devundu - tana kumaaruni bampenu=
mana shareeramu daalchenu - aa prabhuvu -
mana paapamuku doorude ll devuni ll
3. yesukreestanu peruna - rakshakudu velasi naadilalopala =
dosakaari janulato - nento su-bhaashalanu balkinaadu ll devuni ll
4. paapabhaarambu toda - ne proddu - prayaasamula bondedi =
paapulandaru nammina - vishraanti paripoornamittu nanenu ||devuni||
5. satulaina purushulainan - yaa karta sarva janula yedalanu =
satpremaga nadichenu - paraloka sadbodhalika jesenu ||devuni॥
6. chaavu nondina kondarin - yesundu - chakkagaa bratikinchenu =
sakala vyaadhula rogulu - prabhunanti - svasthambu taamondiri ||devuni||
7. gaali sandrapu pongulan - saddanapi - neellapai nadachinaade =
melu gala yadbhutamulu - eelaagu velakoladiga jesenu ||devuni||
8. chetula kaallalonu - raaraaju - chera mekulu bondenu =
paatakulu gottinaare - parishuddha - neeti taa morvalekan ॥devuni||
9. odalu raktamu gaaraga - debbalu - chedugu andaru gottiri =
vadimullu talameedanu - bettiri orcheno rakshakundu ||devuni||
10. inni baadhalu bettuchu - danu jampu - chunna paapa paapa narulanu =
manninchu mani tandrini - yesudu sannutito vedenu ll devuni ll
11. rakshakudu shrama bondagaa - deshambu takshanamu cheeka tayyes =
rakshakudu mruti nondaga - tera chinigi - raati kondalu pagilenu ||devuni||
12. raati samaadhilonu - rakshakuni neetigala dehambunu =
paati pettiri bhaktulu - nammina - naatu landaru joodagaa ||devuni॥
13. moodava dinamanduna - yesundu - mruti gelchi lechinaadu=
naadu nammina manujulu - choochiri - naluvadi dinamulandun ||devuni||
14. padunokandu maarulu - vaaralaku - bratyakshu daaye nesu=
paralokamuna kegenu - tana vaarta- brakatinchumani palkenu ||devuni॥
15. nammi baaptismamondu - narulaku - rakshana mari kalgunu =
nammanollaka poyedu - narulaku narakambu siddhamanenu ||devuni||
Comments
Post a Comment