దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము

దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము = మహా వినోదు
దాపదల స - హాయుడై నన్ బ్రోచును -  అభయ -  మభయ
మభయ మెప్పు - దానంద -  మానంద -  మానంద మౌగ ॥దేవుడే॥


1. పర్వతములు కదిలిన నీ యుర్వి మారుపడినను = సర్వమున్
  ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ -  అభయ - మభయ - మభయ  || దేవుడే॥


2. దేవుడెఫ్టు తోడుగాగ - దేశము వర్ధిల్లును = అ-తావు నందు ప్రజలు
    మిగుల -  ధన్యులై వసింతురు - అభయ - మభయ - మభయ ॥దేవుడే॥


3. రాజ్యముల్ కంపించిన భూ-రాష్ట్రముల్ ఘోషించిన = పూజ్యుడౌ
  యెహోవ వైరి - బూని సంహరించును -  అభయ - మభయ - మభయ ॥దేవుడేll 


4. విల్లు విఱచు నాయన తెగ - బల్లెము నఱకు నాయన = చెల్లచెదర జేసి
    రిపుల - నెల్ల ద్రుంచు - నాయనే - అభయ - మభయ - మభయ ॥దేవుడేll


5. పిశాచి పూర్ణబలము నాతో - బెనుగులాడ జడియును = నశించి శత్రుగణము
    దేవు-నాజ్ఞ వలన మడియును - అభయ - మభయ - మభయ ॥దేవుడేll  


6. కోటయు నాశ్రయమునై యా - కోబు దేవు దుండగ = ఏటి కింక వెరవ
    వలయు - నెపుడునాకు బండుగ -  అభయ - మభయ - మభయ ॥దేవుడేll Devude naa kaashrayambu - divyamaina durgamu = mahaa vinodu Daapadala sa - haayudai nan brochunu - abhaya - mabhaya Mabhaya meppu - daananda - maananda - maananda mauga ॥devude॥ 1. parvatamulu kadilina nee yurvi maarupadinanu = sarvamun ghoshinchuchu nee sandra mupponginan - abhaya - mabhaya - mabhaya lldevudell 2. devudephtu todugaaga - deshamu vardhillunu = a-taavu nandu prajalu migula - dhanyulai vasinturu - abhaya - mabhaya - mabhaya ॥devude॥ 3. raajyamul kampinchina bhoo-raashtramul ghoshinchina = poojyudau yehova vairi - booni sanharinchunu - abhaya - mabhaya - mabhaya ॥devudell 4. villu virachu naayana tega - ballemu naraku naayana = chellachedara jesi ripula - nella drunchu - naayane - abhaya - mabhaya - mabhaya ॥devudell 5. pishaachi poornabalamu naato - benugulaada jadiyunu = nashinchi shatruganamu devu-naajnya valana madiyunu - abhaya - mabhaya - mabhaya ॥devudell 6. kotayu naashrayamunai yaa - kobu devu dundaga = eti kinka verava valayu - nepudunaaku banduga - abhaya - mabhaya - mabhaya ॥devudell


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు