దేవుని నీతి ప్రతాపం
దేవుని నీతి ప్రతాపం - భువి యేసుని సిల్వ ప్రభావం
దేవుల దేవుని ఆపురూపం - భువి యేసుని నామ స్వరూపం
దేవ యెహోవా సువాక్యం సౌభాగ్యం - దైవ జనుల హృదయానందనం
అ.ప. యేసు క్రీస్తు దైవ సుతుండు - యేసుక్రీస్తు మనుజసుతుండు
యేసుక్రీస్తు దేవుండు - యేసే ప్రభువు స్తుతి పాత్రుడు
1. ఆద్యంత రహిత కీర్తి - అవతార శ్రమార్జన మూర్తి
ఆకస రాసుల ఆధిపతి - అవనీ సృజనాత్మ ప్రతీతి
అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత అనుదిన కృపలిడు సుఖదాత
2. పాపము భయపడు నామం - పాపాత్ముడు కృపగను హోమం
పతితుల వెదకిన ప్రేమ స్వరం - పరలోక సుఖాల విహారం
పాప క్షమాపణ గానం - బహు మానం అనవరతము నిజ బలిదానం
3. జనముల జీవాధిపతి - జగమంతటి నేలెడి జ్యోతి
జీవుల అంతిమ న్యాయపతి - జీవాత్ములు క్రోలెడి నీతి
జనన మరణ జయశీల - నరపాల జగతిని మార్చెడి శుభజ్వాల
Devuni neeti prataapam - bhuvi yesuni silva prabhaavam
Devula devuni aapuroopam - bhuvi yesuni naama svaroopam
Deva yehovaa suvaakyam saubhaagyam -
daiva janula hrudayaanandanam
A.pa. yesu kreestu daiva sutundu - yesukreestu manujasutundu
yesukreestu devundu - yese prabhuvu stuti paatrudu
1. aadyanta rahita keerti - avataara shramaarjana moorti
aakasa raasula aadhipati - avanee srujanaatma prateeti
akhila prapancha pradaata -
adhineta anudina krupalidu sukhadaata
2. paapamu bhayapadu naamam - paapaatmudu krupaganu homam
patitula vedakina prema svaram - paraloka sukhaala vihaaram
paapa kshamaapana gaanam -
bahu maanam anavaratamu nija balidaanam
3. janamula jeevaadhipati - jagamantati neledi jyoti
jeevula antima nyaayapati - jeevaatmulu kroledi neeti
janana marana jayasheela -
narapaala jagatini maarchedi shubhajvaala.
Comments
Post a Comment