దేవునికి స్తోత్రము గానము
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది. ll దేవు॥
1. యెరుషలేము యెహోవాయే - కట్టుచున్నవాడని
ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని ll దేవు॥
2. గుండె చెదరినవారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని ll దేవు॥
3. నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు – పెట్టుచున్నవాడని ll దేవు॥
4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తిసంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని ll దేవు॥
5. దీనులకు అండాయనే - భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని - స్తుతులతో కీర్తించుడి ll దేవు॥
6. ఆయన ఆకాశమున్ - మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము - సిద్ధపరచువాడని ll దేవు॥
7. పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ll దేవు॥
8. గుర్రముల నరులందలి - బలము నానందించడు
కృపకు వేడువారిలో - సంతసించువాడని ll దేవు॥
9. యెరూషలేము యెహోవాను - సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ll దేవు॥
10. పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును ll దేవు॥
11. భూమికి తన యాజ్ఞను - ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును ll దేవు॥
12. వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని
ఏ జనము కీలాగున - చేసియుండలేదని ll దేవు॥
Devuniki stotramu gaanamu - cheyutaye manchidi
Manamandaramu stutigaanamu cheyutaye manchidi. ll devu॥
1. yerushalemu yehovaaye - kattuchunnavaadani
ishraayeleeyulanu - pogucheyuvaadani ll devu॥
2. gunde chedarinavaarini baagucheyuvaadani
vaari gaayamulanniyu - kattuchunnavaadani ll devu॥
3. nakshatramula sankhyanu - aayane niyaminchenu
vaatikanniyu perulu – pettuchunnavaadani ll devu॥
4. prabhuvu goppavaadunu adhika shaktisampannudu
jnyaanamunaku aayane - mitiyu lenivaadani ll devu॥
5. deenulaku andaayane - bhaktiheenula koolchunu
sitaaraato devuni - stutulato keertinchudi ll devu॥
6. aayana aakaashamun - meghamulato kappunu
Bhoomi koraku varshamu - siddhaparachuvaadani ll devu॥
7. parvatamulalo gaddini - pashuvulaku molipinchenu
Arachu pillakaakulakunu aahaaramu taaneeyunu ll devu॥
8. gurramula narulandali - balamu naanandinchadu
krupaku veduvaarilo - santasinchuvaadani ll devu॥
9. yerooshalemu yehovaanu - seeyonu nee devuni
keertinchumu koniyaadumu aanandinchuvaadani ll devu॥
10. pillala naasheervadinchiyu - balaparache nee gummamul
manchi godhuma pantato - ninnu truptiga nunchunu ll devu॥
11. bhoomiki tana yaajnyanu - ichchuvaadu aayane
vegamuganu devuni - vaakyamu parugettunu ll devu॥
12. vaakyamunu yaakobuku - teliyajesinavaadani
e janamu keelaaguna - chesiyundaledani ll devu॥
Comments
Post a Comment