వినరే యో నరులారా – వీనుల కింపు మీర

1.వినరే యో నరులారా – వీనుల కింపు మీర

మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే

అనుదినమును దే-వుని తనయుని పద

వనజంబులు మన-మున నిడికొనుచును    ||వినరే||


2.నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు – కరుణను గనరే        ||వినరే||

3.ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను
దీన దయా పరు-డైన మహాత్ముడు
జానుగ యాగము – సలిపిన తెరంగిది       ||వినరే||

4.ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు-ములనలరెడు ధని
కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే||

5.దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
బిరబిర మన మం-దర మా కరుణా
శరనిధి చరణ మె – శరణని పోదము       ||వినరే|| 1.vinare yo narulaaraa – veenula kimpu meera Manala rakshimpa kreestu – maanujaavataarudayye – vinare Anudinamunu de-vuni tanayuni pada Vanajambulu mana-muna nidikonuchunu ||vinare|| 2.nara roopu booni ghora – narakula raarammani Duritamu baapu dodda – dorayau mariyaa varaputrudu Kara maru dagu ka-lvari giri dari kari Gi rayambuna prabhu – karunanu ganare ||vinare|| 3.aanandamaina moksha-mandari kiyya deeksha Booni tana meni siluva – mraanu nanachi mruti bondenu Deena dayaa paru-daina mahaatmudu Jaanuga yaagamu – salipina terangidi ||vinare|| 4.ila maayaavaadula maani – yitade sadguru dani Talaposi choochi mati ni-shchala bhaktini golichina vaariki Nila janulaku galu-mulanalaredu dhani Kula kandani sukha-mulu mari yosamgunu ||vinare|| 5.duritamu lanapa vachchi – maranamai tirigi lechi Nirata mokshaananda sun-dara mandiramuna karuduga jane Birabira mana man-dara maa karunaa Sharanidhi charana me – sharanani podamu ||vinare||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు