విడువను నిను ఎడబాయనని నా
విడువను నిను ఎడబాయనని నా
కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా
1.నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2)
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను||
2.పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2)
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను||
3.మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2)
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను||
4.సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2)
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను ||విడువను||
Viduvanu ninu edabaayanani naa
Kabhaya mosangina devaa
Naa kabhaya mosangina devaa
1.neramulenno chesi chesi – daari tappi tirigitinayyaa (2)
Neramu baapumu devaa – nee daarini nadupumu devaa ||viduvanu||
2.pandulu mepuchu aakali baadhalo – pottunu korina neechudanayyaa (2)
Nee dari cheritinayyaa naa tandrivi neevegadayyaa ||viduvanu||
3.mahima vastramu samaadhaanapu jodunu naaku todigitivayyaa (2)
Goppagu vindulo cherchi nee komarunigaa chesitivi ||viduvanu||
4.sundaramaina vindulalo parishuddulato kalipitivayyaa (2)
Nindugaa naa hrudayamuto deva vandanamarpinchedanu ||viduvanu||
Comments
Post a Comment