వినవా మనవి యేసయ్యా
వినవా మనవి యేసయ్యా
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం – పగిలెను జీవితం
చేసుకో నీ వశం ||వినవా||
1.లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా ||వినవా||
2.ఆశ ఏది కానరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా
నా దైవము నీవయ్యా ||వినవా||
Vinavaa manavi yesayyaa
Prabhuvaa sharanam neevayyaa
Malinamu naa gatam – pagilenu jeevitam
Chesuko nee vasham ||vinavaa||
1.loka snehame kori dooramaitini
Veedipoyi nee daari odipotini
Virigina manasuto ninnu cheraanu
Chitikina bratukulo baagu koraanu
Nannu sveekarinchi neeto undanee yesayyaa
Naa tandri neevenayyaa ||vinavaa||
2.aasha edi kaanaraaka belanaitini
Baadhalinka padaleka solipotini
Alasina kanulato ninnu choosaanu
Chedarina kalalato krungipoyaanu
Nannu sedadeerchi santoshinchani yesayyaa
Naa daivamu neevayyaa ||vinavaa||
Comments
Post a Comment