శాశ్వత కృపను నేను తలంచగా
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత||
1.నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత||
2.దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత||
3.భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత||
4.సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత||
5.నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత||
Shaashvata krupanu nenu talanchagaa
Kaanukanaitini nee sannidhilo (2) ||shaashvata||
1.naa hrudayamento jeevamugala devuni
Darshimpa aanandamuto keka veyuchunnadi (2)
Naa dehamento neekai aashinche (2) ||shaashvata||
2.dootalu cheyani nee divya sevanu
Dhoolinaina naaku cheya krupanichchitive (2)
Dhoopaartini chepatti cheseda (2) ||shaashvata||
3.bhaktiheenulato nivasinchutakantenu
Nee mandiraavaranamulo okkadinamu gaduputa (2)
Veyidinaala kante shreshtamainadi (2) ||shaashvata||
4.seeyonu shikharaana siluva sitaarato
Sinhaasanamu eduta krotta paata paadeda (2)
Seeyonu raaraajuvu neevegaa (2) ||shaashvata||
5.nootanamaina ee jeeva maargamanduna
Nootana jeevamu aatmaabhishekame (2)
Nootana srushtigaa nannu maarchenu (2) ||shaashvata||
Comments
Post a Comment