లోకమంతట వెలుగు ప్రకాశించెను

లోకమంతట వెలుగు ప్రకాశించెను

యేసు జన్మించినపుడు

ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు

లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2)

లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి        ॥లోకమంతట॥


1.నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
వాడు చీకటిలో నడువక – (2)
జీవపువెలుగై యుండుడనె యేసు   ॥లోకమంతట॥

2.ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన నక్కరలేదు
ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2)
పిల్లయే దీపమై వెలుగుచుండు      ॥లోకమంతట॥

3.విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు వెలుగు సంబంధులు
విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి – (2)
వెలుగై యుందురనె యేసుండు       ॥లోకమంతట॥

4.చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును
చూచిరి ధన్యులై
లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద
ప్రకాశించెను గొప్ప వెలుగు – (2)
ప్రభువు యేసుకు జేయని పాడరే     ॥లోకమంతట॥ Lokamantata velugu prakaashinchenu Yesu janminchinapudu Aakaashamunandu goppa nakshatrambu buttenapudu Lokajnyaanulu gollalu velli – (2) Loka rakshakudesuku mrokkiri ॥lokamantata॥ 1.nenu velugai cheekatilo veluguchunnaanu Cheekati daani grahimpa ledu Nenu lokamunaku velugai yunnaanu nanu vembadinchu Vaadu cheekatilo naduvaka – (2) Jeevapuvelugai yundudane yesu ॥lokamantata॥ 2.aa pattanamulo velugutaku sooryudainanu Chandrudaina nakkaraledu Aa pattanamulo devuni mahimaye prakaashinchuchunnadi yepudu Aa pattanamunaku devuni gorre – (2) Pillaye deepamai veluguchundu ॥lokamantata॥ 3.viూru lokamunaku velugai yunnaaru ganuka Viూru velugu sambandhulu Viూru kondapaina kattabadina pattanambuvalene Marugai yundaka narulandariki – (2) Velugai yundurane yesundu ॥lokamantata॥ 4.cheekatilo naduchujanulu goppa velugunu Choochiri dhanyulai Loka mandu maranachchhaayagala deshanivaasula viూda Prakaashinchenu goppa velugu – (2) Prabhuvu yesuku jeyani paadare ॥lokamantata॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు