లాలి లాలి జోలాలి

లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి

కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి (2)

లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి (2)

మాదు తండ్రికి మా లాలి (2)     ||లాలి||


1.చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని
పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని (2)
మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2)     ||లాలి||

2.దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని
మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని (2)
సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2)      ||లాలి||

Laali laali jolaali – baala yesunaku laali Kanya mariyaa tanayunaku – paada randi jolaali (2) Loka rakshakunaku laali – shaanti kartaku jolaali (2) Maadu tandriki maa laali (2) ||laali|| 1.cheekati dontarala teralaku – teranu dimpagaa vachchinaavani Paapa shaapapu taapamulaku – rakshananu ila techchinaavani (2) Maanavula mochakudaa laali – dharanim pai daivamaa jolaali (2) Maadu tandriki maa laali (2) ||laali|| 2.daari teliyani maanavaaliki – daari neevai velasinaavani Marana chhaayalu roopumaapaga – jeeva kiranamai merisinaavani (2) Satya roopunaku laali – neeti sooryunaku jolaali (2) Maadu tandriki maa laali (2) ||laali||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు