లోకమును విడచి వెళ్ళవలెనుగా
లోకమును విడచి వెళ్ళవలెనుగా (2)
సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్ ||లోకమును||
1.యాత్రికులము ఈ దుష్ట లోకములో
పాడు లోకములో మనకేది లేదు (2)
ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము
జాగ్రత్తగానే నడచుకొనెదము (2) ||లోకమును||
2.మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదాము (2)
నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై
పరిపూర్ణతను చేపట్టుదాము (2) ||లోకమును||
3.ఆత్మీయ నేత్రాలతో చూచెదాము
ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2)
ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదము
విజయోత్సవముతో ప్రవేశించెదము (2) ||లోకమును||
Lokamunu vidachi vellavalenugaa (2)
Sarvamichchatane viduvavalen – viduvavalen ||lokamunu||
1.yaatrikulamu ee dushta lokamulo
Paadu lokamulo manakedi ledu (2)
E vishayamandaina garvinchalemu (2) garvinchalemu
Jaagrattagaane nadachukonedamu (2) ||lokamunu||
2.mana eershya kapataa dveshaalu vidachi
Nija prematone jeevinchedaamu (2)
Nishkalankulamai shuddhulamai (2) shuddhulamai
Paripoornatanu chepattudaamu (2) ||lokamunu||
3.aatmeeya netraalato choochedaamu
Entaa adbhutamo saundarya nagaram (2)
Prabhuvu chentaku velledamu (2) velledamu
Vijayotsavamuto praveshinchedamu (2) ||lokamunu||
Comments
Post a Comment