రారాజు జన్మించే ఇలలోన
రారాజు జన్మించే ఇలలోన
యేసు రారాజు జన్మించే ఇలలోన (2)
ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా
రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)
ఓ సోదరా… ఓ సోదరీ… (2)
విష్ యు హాప్పీ క్రిస్మస్
అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2) ||రారాజు||
1.అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)
రాజులకు రారాజు పుడతాడంటూ
లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)
రాజాధి రాజుని చూడాలంటూ
(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా||
2.అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)
రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)
ఈ లోక రక్షకుని చూడాలంటూ
(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా||
Raaraaju janminche ilalona
Yesu raaraaju janminche ilalona (2)
Ee shubha sangatini – ooroo vaadantaa
Randee manamantaa chaati cheppudaam (2)
O sodaraa… o sodaree… (2)
Vish yu haappee krismas
And velkam yu tu krismas (2) ||raaraaju||
1.adigadigo toorpuna aa chukkemiti sodaraa
Granthaalanu vippi daani ardamento choodaraa (2)
Raajulaku raaraaju pudataadantoo
Lekhanaalu cheppinattu jarigindantoo (2)
Raajaadhi raajuni choodaalantoo
(toorpu) jnyaanulanta prabhu yesuni choodavachchiri – (2) ||o sodaraa||
2.adigadigo tellani aa velugemiti sodaraa
(ani) gollalanta bhayapadutoo vanikipotu undagaa (2)
Rakshakudu meekoraku puttaadantoo
Gollalato devadoota maatlaadenoo (2)
Ee loka rakshakuni choodaalantoo
(aa) gollalanta prabhu yesuni choodavachchiri – (2) ||o sodaraa||
Comments
Post a Comment