రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2)

నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా  నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా

నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2)   llరాజాll


1.నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2)      llనేనుండలేనయ్యాll

2.ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2)
ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2)     llనేనుండలేనయ్యాll

3.ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా (2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2)       llనేనుండలేనయ్యాll Raajaa nee sannidhilone untaanayyaa manasaaraa aaraadhistoo bratikestaanayyaa (2) Nenundalenayyaa ne bratukalenayyaa nenundalenayyaa ne bratukalenayyaa Neeve lekundaa nenundalenayyaa nee tode lekundaa ne bratukalenayyaa (2) llraajaall 1.nee sannidhaanamulo sampoorna santosham aaraadhinchukone viluvaina avakaasham (2) Kolpoyinavanni naaku ichchutakunu baadhala nundi bratikinchutakunu (2) Neeve raakapote nenemaipoduno (2) llnenundalenayyaall 2.ontari poru nannu visiginchinaa manushulellaru nannu tappupattinaa (2) Ontarivaade veyi mandi annaavu nenunnaanule bhayapadaku annaavu (2) Nenante neeku inta prema entayyaa (2) llnenundalenayyaall 3.oopiraagevaraku neetone jeevistaa e daarilo nadipinaa nee vente nadichostaa (2) Vishvaaniki karta neeve naa gamyamu nee baatalo naduchuta naakento ishtamu (2) Ninnu minchina devude ledayyaa (2) llnenundalenayyaall


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు