రారే చూతము రాజసుతుని

రారే చూతము రాజసుతుని  రేయి జనన మాయెను (2)

రాజులకు రారాజు మెస్సయ్యా (2)

రాజితంబగు తేజమదిగో (2)      llరారేll


1.దూత గణములన్ దేరి చూడరే  దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2)     llరారేll 

2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2)     llరారేll


3.బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2)       llరారేll

4.యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె (2)
సదమలంబగు మదిని గొల్చిన (2)
సర్వ జనులకు సార్వభౌముడు (2)   llరారేll Raare chootamu raajasutuni reyi janana maayenu (2) Raajulaku raaraaju messayyaa (2) Raajitambagu tejamadigo (2) llraarell 1.doota ganamulan deri choodare daiva vaakkulan delpagaa (2) Devude mana deenaroopuna (2) Dharani karige-nee dinamuna (2) llraarell 2.kallagaadidi kalayu gaadidi golla boyula darshanam (2) Tellagaanade tejarilledi (2) Taara gaanchare tvaraga raare (2) llraarell 3.baalu-dadugo vela sooryula bolu sadguna sheeludu (2) Baala baalika baalavruddhula (2) Nela galgina naathudu (2) llraarell 4.yoodavanshamu nuddharimpa daaveedupuramuna nudbhavinche (2) Sadamalambagu madini golchina (2) Sarva janulaku saarvabhaumudu (2) llraarell


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు