రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము

రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము

నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు


1.హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను         ||రావయ్య||

2.నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు     ||రావయ్య||

3.మేర లేని పాపము మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు     ||రావయ్య||

4.పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను
మా పాపంబులన్నియు పారద్రోలుటకు       ||రావయ్య||

5.అందమైన నీదు పరమానంద పురమందు
మేమందరము జేరి యానందించుటకు       ||రావయ్య|| Raavayya yesunaathaa maa rakshana maargamu Nee seva jeya mammu jepattutaku 1.hadduleka memu ila moddulamai yuntimi Maa koddi buddulanni diddi rakshimpanu ||raavayya|| 2.nindu vedukatonu mammu benduvadaka chesi Maa gandambulanniyu khandinchutaku ||raavayya|| 3.mera leni paapamu maaku bhaaramaina mopu Neevu doorambugaa jesi daari jooputaku ||raavayya|| 4.paapulamayya memu parama tandrini gaanakanu Maa paapambulanniyu paaradrolutaku ||raavayya|| 5.andamaina needu paramaananda puramandu Memandaramu jeri yaanandinchutaku ||raavayya||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు