గాడాంధకారపు లోయలో
గాడాంధకారపు లోయలో - నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక - ఉన్నావు తోడుగ నా త్రోవలో (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి. (2)
నా ఆశ్రయ దుర్గము నీవే - నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే - నా శిక్షను భరియించితివే. ||గాడాంధకారపు||
1.పచ్చిక గల చోట్లలో నిలిపావు - శాంతి జలములందు నన్ను నడిపావు. (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి. (2)
నా ఎత్తైన కోట నీవే - నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే - నా జీవన దాతా నీవే. ||గాఢాంధకారపు||
2.నూనెతో నా తలను అంటావు - నా గిన్నెను పొర్లి పారజేసావు. (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి. (2)
నా మొరను ఆలించావే - నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే - నీ కరమున నను దాచావే. ||గాఢాంధకారపు||
3.చీకటి బ్రతుకును వెలిగించావు - రణపు భయమును తొలగించావు. (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి. (2)
నా త్రోవకు వెలుగు నీవే - నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే - కొనిపోవగ రానున్నావే. ||గాఢాంధకారపు||
Gaadaandhakaarapu loyalo - ne sancharinchina velalo
Apaayamemiyu raaneeyaka - unnaavu toduga naa trovalo (2)
Yesayya neeve maa kaaparivi - emi lemi leka kaapaaditivi. (2)
Naa aashraya durgamu neeve - naa balamaina shailamu neeve
Naa rakshana shrungamu neeve -
naa shikshanu bhariyinchitive. ||gaadaandhakaarapu||
1.pachchika gala chotlalo nilipaavu -
shaanti jalamulandu nannu nadipaavu. (2)
Yesayya neeve maa kaaparivi - emi lemi leka kaapaaditivi. (2)
Naa ettaina kota neeve - ne nadiche prati chota neeve
Naa rakshanakartaa neeve -
naa jeevana daataa neeve. ||gaadhaandhakaarapu||
2.nooneto naa talanu antaavu - naa ginnenu porli paarajesaavu. (2)
Yesayya neeve maa kaaparivi - emi lemi leka kaapaaditivi. (2)
Naa moranu aalinchaave - nee varamulu naakosagaave
Naa parama tandrivi neeve -
nee karamuna nanu daachaave. ||gaadhaandhakaarapu||
3.cheekati bratukunu veliginchaavu -
ranapu bhayamunu tolaginchaavu. (2)
Yesayya neeve maa kaaparivi - emi lemi leka kaapaaditivi. (2)
Naa trovaku velugu neeve - naa naavaku chukkaani neeve
Nanu kaavaga etenchitive -
konipovaga raanunnaave. ||gaadhaandhakaarapu||
Comments
Post a Comment