గమ్యం చేరాలని నీతో ఉండాలని
గమ్యం చేరాలని నీతో ఉండాలని - పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనా - శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని - నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ll గమ్యం ll
1.భువి అంతా తిరిగి జగమంతా నడచి - నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి - నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో. ||సాగిపోతున్నాను||
2.అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా - శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా - నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని. ||సాగిపోతున్నాను||
Gamyam cheraalani neeto undaalani -
pagaloo reyi paravashinchaalani
Ee ningi nelaa kanumarugainaa -
shaashvata jeevam pondaalani
Saagipotunnaanu ninnu choodaalani -
nireekshistunnaanu ninnu cheraalani (2) ll gamyam ll
1.bhuvi antaa tirigi jagamantaa nadachi -
nee jnyaanamuku spandinchaalani
Naakunnavanni samastam vechchinchi -
nee prema ento kolavaalani
Adi enta ettuna undo – adi enta lotuna undo
Adi e roopanlo undo – adi e maatallo undo. ||saagipotunnaanu||
2.alalenno reginaa shramalenno vachchinaa -
shiramunu vanchi sahinchaalani
Vedana baadhalu gundenu pindinaa -
needu siluvane moyaalani
Naa gunde kovelalonaa – ninne ne pratishtinchi
Nee sevalone ilalo – naa tudi shvaasanu vidavaalani. ||saagipotunnaanu||
Comments
Post a Comment