భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||
1.మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ ||
2.ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ ||
3.పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ ||
4.మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ ||
5.మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ ||
Bheekarundau maa yehovaa – peetha medutan goodare Ekamai saashtaangapadi sarveshvaruni goniyaadare ||bheekarundau|| 1.Mattitone mammu nella – maanavuluga srujinchenu Itti shaktundau prabhun me-mechchugaa madi nentumu || bheeka || 2.Eritodu leka mamu sa-rveshvarudu srushtinchenu Dhaarunin daanokkade maa – daivamani poojintumu || bheekarundau || 3.Puttagittan jeya daanai – natti devuni shaktini Battugaa lokastulaaraa – prastutimpare bhaktini || bheekarundau || 4.Meti sangeetambulapai – minta naarava mondanu Jaatare vevela nollan – sannutul prabhu vandanu || bheekarundau || 5.Mikkili kashtambulato – mittikini baalpondanu Dikku leni gorrelatlu – diruga jerpan mandanu || bheekarundau ||
Comments
Post a Comment