భూమియు దాని సంపూర్ణత లోకము
భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే (2)
1.ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు||
2.యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు||
3.వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2) ||భూమియు||
4.నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2) ||భూమియు||
5.గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2) ||భూమియు||
6.మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2) ||భూమియు||
7.మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2) ||భూమియు||
Bhoomiyu daani sampoornata lokamu Daani nivaasu lehovaave (2) 1.aayana samudramu meeda daaniki punaadi vesenu (2) Pravaahajalamula meeda daanini sthiraparachenu (2) ||bhoomiyu|| 2.yehovaa parvatamunaku nekkadagina vaadevvadu (2) Yehovaa parishuddha sthalamulo niluvadagina vaadevvadu (2) ||bhoomiyu|| 3.vyarthamaina daaniyandu manassu pettakayu (2) Nirdoshachetulu shuddha hrudayamu kaliginavaade (2) ||bhoomiyu|| 4.ninnaashrayinchi nee sannidhini vedakedi vaadu (2) Vaadaasheervaadamu neeti matvamu nondunu (2) ||bhoomiyu|| 5.gummamulaaraa mee talalu paikettudi puraatanamaina talupulaaraa (2) Mahimagala raaju praveshinchunatlu mimmunu levanettikonudi (2) ||bhoomiyu|| 6.mahimagala yee raajevadu? balashauryamugala prabhuve (2) Yuddhashoorudaina yehovaa paraakramamugala prabhuve (2) ||bhoomiyu|| 7.mahimagala yee raajevadu? sainyamula yehovaaye (2) Aayane yee mahimagala raaju hallelooyaa aamen (2) ||bhoomiyu||
Comments
Post a Comment