ఓ ప్రార్ధనా సుప్రార్ధనా

1.ఓ ప్రార్ధనా సుప్రార్ధనా - నీ ప్రాభావంబున్ మరతునా

నా ప్రభువున్ ముఖా ముఖిన్ - నే బ్రణుతింతు నీ ప్రభన్

నా ప్రాణమా సు ప్రార్ధనా - నీ ప్రేరణంబుచే గదా

నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్ధనా సుప్రార్ధనా

2.పిశాచి నన్ను యుక్తితో - వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే - నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా - నా శైలమున ప్రార్ధనా
నా శోక మెల్ల దీర్చెడు - విశేషమైన ప్రార్ధనా

3.నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖ భార మెల్లను
నా దేవుడేసు చెంతకు - మోదంబు గొంచు బోవును
సదా శుభంబు లొందను - విధంబు జూప నీవెగా
నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా - సుధా సుధార ప్రార్ధనా

4.అరణ్యమైన భూమిలో - నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా - చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చి నే - బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ - పరేశు ధ్యాన ప్రార్ధనా 1.o praardhanaa supraardhanaa - nee praabhaavambun maratunaa Naa prabhuvun mukhaa mukhin - ne branutintu nee prabhan Naa praanamaa su praardhanaa - nee preranambuche gadaa Nee premadhaara groludu - no praardhanaa supraardhanaa 2.pishaachi nannu yuktito - vashambu cheya joochucho Nee shaantamaina deeptiye - naa shanka lella maanupun Nee shakti nenu maratunaa - naa shailamuna praardhanaa Naa shoka mella deerchedu - visheshamaina praardhanaa 3.nee divyamaina rekkale - naa duhkha bhaara mellanu Naa devudesu chentaku - modambu gonchu bovunu Sadaa shubhambu londanu - vidhambu joopa neevegaa Naa dhairyamichchum praardhanaa - sudhaa sudhaara praardhanaa 4.aranyamaina bhoomilo - naa ramyamau pisgaa nagam Bu rangugaanu nekki naa - chira gruhambu jootunu Shareeramun vidalchi ne - barambu bovu velalo Karambu ninnu mechchedan - pareshu dhyaana praardhanaa

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు