ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము

ఆకాశ తార పర్వత - సముద్ర-ములకన్న గొప్పది (2)  ||ఓ యేసు||

1.అగమ్య ఆనందమే - హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి - ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు - స్తుతికి యోగ్యములు     ||ఓ యేసు||

2.సంకట సమయములో - సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని  - నేను మెరపెట్టగా వింటినంటివి
నా మొర్రకు ముందే - తోడునుందునంటివి. (2)    ||ఓ యేసు||

3. మరణాంధకారపు లోయనే సంచరించిన
నిరంతరమేసు నాదు కాపరియై - కరములిచ్చి
నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2)   ||ఓ యేసు||

4..కొదువలెన్ని యున్నా - భయపడను నే నెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును - భోజన జలములతో
తృప్తి పరచుచు - నాతో నుండు నేసు. (2)         ||ఓ యేసు||

5.దేవుని గృహములో - సదా స్తుతించెదనూ సంపూర్ణ హృదయముతో
సదా భజించెదను - స్తుతి ప్రశంస-లకు  యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ - హల్లేలూయా ఆమేన్  (2) ||ఓ యేసు|| O yesu nee prema - ento mahaaneeyamu Aakaasha taara parvata - samudra-mulakanna goppadi (2) ||o yesu|| 1.agamya aanandame - hrudayamu nindenu Prabhuni kaaryamulu gambheeramainavi - prati udaya saayantramulu Stutiki yogyamulu - stutiki yogyamulu ||o yesu|| 2.sankata samayamulo - saagalekunnaanu Dayachoopu naa meedaa ani - nenu merapettagaa vintinantivi Naa morraku munde - todunundunantivi. (2) ||o yesu|| 3. maranaandhakaarapu loyane sancharinchina Nirantaramesu naadu kaapariyai - karamulichchi Nannu gaayuchu nadupu karunagala prabhuvu (2) ||o yesu|| 4..koduvalenni yunnaa - bhayapadanu ne neppudu Pachchika bayalulo parunda jeyunu - bhojana jalamulato Trupti parachuchu - naato nundu nesu. (2) ||o yesu|| 5.devuni gruhamulo - sadaa stutinchedanoo sampoorna hrudayamuto Sadaa bhajinchedanu - stuti prashansa-laku yogyudesu Hallelooyaa aamen - hallelooyaa aamen (2) ||o yesu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు