ఏ పాపమెరుగని యో పావన మూర్తి

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా

1.ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||

2.కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప||

3.చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప||

4.ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||

5.పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప||

6.బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప||

7.కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప|| E paapamerugani yo paavana moorti paapa vimochakundaa Naa paali daivamaa naa paapamula kora kee paatlu nondinaavaa 1.mullato kireeta – malli nee shiramupai – jallaatamuna mottiraa Mulla potlaku shiramu – talladillaga somma – sillipotiva rakshakaa ||e paapa|| 2.kaluvari giri danuka – siluva moyaleka – kalavaramu nondinaavaa Siluva neeto moya – tuluvalu verokani – todugaa nichchinaaraa ||e paapa|| 3.chedugu yoodulu bettu – padaraani paatlaku – sudivadi nadachinaavaa Kadaku kalvari giri – kada kegi silvanu – grakkuna dinchinaavaa ||e paapa|| 4.aa kaala karmulu – bheekarambuga ninnu – aa koyyapai nunchiraa Nee kaalu setulu – aa koyyake soodi – mekulato gruchchinaaraa ||e paapa|| 5.paluvidhambula shramalu – chelarega dandriki – nelugetti moraliditivaa Siluvapai palumaaru – kaluguchundedi baadha – valana daahamu naayenaa ||e paapa|| 6.ballidundagu bantu – ballemuna nee prakka – jilli bada bodachinaadaa Ullolamulavale nalla neerubukanga jallaare gada kopamu ||e paapa|| 7.kata kataa paapa sam – katamu baaputa kinta – patu baadha nondinaavaa Etuvantidee prema – yetuvantidee shaanta – metula varnintu svaami ||e paapa||

 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు