ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు

ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)

1.నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2)
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది    ||ఏపాటి||

2.కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నను విడచినా నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా    ||ప్రేమించే||

3.నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2)
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా       ||ప్రేమించే|| Epaati daananayaa nannintaga hechchinchutaku Nenentati daananayaa naapai krupa chooputaku (2) 1.naa doshamu bhariyinchi naa paapamu kshamiyinchi Nanu neelaa maarchutaku kaluvarilo maraninchi (2) Preminche premaamayudaa – nee premaku parimitulevi Krupa choopu krupagala devaa – nee krupaku saati edi ||epaati|| 2.kashtaala kadalilo kanneeti loyalalo Naa todu nilichaavu nannaadarinchaavu (2) Andaru nanu vidachinaa nanu viduvani yesayyaa Viduvanu yedabaayanani naa todai nilachitivaa ||preminche|| 3.nee premanu maruvalenayyaa nee saakshiga bratikedanesayyaa Nenondina nee krupanu prakatintunu bratukantaa (2) Nenondina ee jayamu neevichchinadenayyaa Neevichchina jeevamukai stotramu yesayyaa ||preminche||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు