ఉన్నపాటున వచ్చు-చున్నాను
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధికో రక్షకా =
యెన్న శక్యము గాని పాపము - లన్ని మోపుగ వీపుపైబడి -
యున్నవిదె నడలేక తొట్రిలు - చున్నవాడను నన్ను దయగను
1. కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
భూరిదయతో నన్ను నీదరి జేరరమ్మని పిలుచుటయు ని-
ష్కారణపు నీ ప్రేమ యిది మరి - వేరే హేతువు లేదు నాయెడ ॥ఉన్న॥
2. మసిబొగ్గువలె నా మా-నస మెల్ల గప్పె దో - షసమూహములు మచ్చలై
అసిత మగు ప్రతిడాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను
నసువు లిడు నీ రక్తమేయని మసల కిప్పుడు సిలువ నిదెగని ॥ఉన్న॥
3. వెలుపట బహుయుద్ద-ములు లోపటను భయము కలిగి నెమ్మది దొలగెను
పలువిధములగు సందియంబుల వలన పోరాటము లచే నే
నలసి యిటునటు గొట్టబడి దుర్భలుడనై గాయములతో నిదె ॥ఉన్న॥
4. కడు బీదవాడ నం-ధుడను దౌర్భాగ్యుడను - జెడిపోయి పడియున్నాను
సుడివడిన నామదికి స్వస్థత - జెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీచే బడయుటకు నా యొడయుడా యిదె ॥ఉన్న॥
5. నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి- జీవ మార్గము గంటిని
కేవలంబగు ప్రేమచేతను నీవు నన్ను క్షమించి చేకొని
భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న||
6. దరిలేని యానంద కరమైన నీ ప్రేమ- తరమే వర్ణన చేయను
తెరవుకడ్డంబైన యన్నిటి - విఱుగగొట్టెను గాన నేనిపుడరుదుగా
నీవాడ -నవుటకు - మరి నిజము నీవాడనువుటకే ॥ఉన్న॥
Unnapaatuna vachchu-chunnaanu nee paada sannidhiko rakshakaa =
Yenna shakyamu gaani paapamu - lanni mopuga veepupaibadi -
Yunnavide nadaleka totrilu - chunnavaadanu nannu dayaganu
1. kaarunyanidhi yesu naa rakshakaa nee sha-reera raktamu chinduta
bhooridayato nannu needari jerarammani piluchutayu ni-
shkaaranapu nee prema yidi mari - vere hetuvu ledu naayeda ॥unna॥
2. masibogguvale naa maa-nasa mella gappe do - shasamoohamulu machchalai
asita magu pratidaagu tuduvanu gasatu gadigi pavitra parapanu
nasuvu lidu nee raktameyani masala kippudu siluva nidegani ॥unna॥
3. velupata bahuyudda-mulu lopatanu bhayamu kaligi nemmadi dolagenu
paluvidhamulagu sandiyambula valana poraatamu lache ne
nalasi yitunatu gottabadi durbhaludanai gaayamulato nide ॥unna॥
4. kadu beedavaada nan-dhudanu daurbhaagyudanu - jedipoyi padiyunnaanu
sudivadina naamadiki svasthata - jedina kanulaku drushti bhaagyamu
badaya valasina vanni neeche badayutaku naa yodayudaa yide ॥unna॥
5. nee vaagdattamu nammi neepai bhaaramu petti- jeeva maargamu gantini
kevalambagu premachetanu neevu nannu kshaminchi chekoni
bhaavashuddhi nonarchi santoshaavasaramula niduduvani yide ||unna||
6. darileni yaananda karamaina nee prema- tarame varnana cheyanu
teravukaddambaina yanniti - virugagottenu gaana nenipudarudugaa
neevaada -navutaku - mari nijamu neevaadanuvutake ॥unna॥
Comments
Post a Comment