Tuesday, 30 December 2025

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో

 "వందనంబొనర్తుమో ప్రభో ప్రభో"

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో

వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా

వందనంబు లందుకో ప్రభో.          ||వందనం||


ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు
గన్న తండ్రి మించి ఎపుడు గాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రములివిగో.        ||వందనం||

ప్రాత వత్సరంపు బాప మంతయు
బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా
దాత క్రీస్తు నాథ రక్షకా.                  ||వందనం||

దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాలి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా.               ||వందనం||

కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడా.         ||వందనం||

మా సభలను పెద్దజేసి పెంచుము
నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నందకార మంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము.     ||వందనం||


No comments:

Post a Comment

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...