తనువు నాదిదిగో గై
తనువు నాదిదిగో గై-కొనుమీ యో ప్రభువా నీ
పనికి బ్రతిష్ఠించుమీ = దినములు క్షణములు
దీసికొని యవి నీదు - వినతిన్ బ్రవహింప జే - యను శక్తినీయుమీ ॥తనువు|
1. ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పనిజేయజేతు
లివిగో = యనయంబు నీ విషయ-మై సొగసుగా జురుకు -
దనముతో బరుగెత్త - వినయ పాదము లివిగో ||తనువు||
2. స్వరమిదిగో కొనుమీ - వరరాజ నిను గూర్చి - నిరతమ్ము
పాడనిమ్ము = మరియు పెదవు లివిగో మహనీయమైన
నీ - పరిశుద్ధ వార్తతో బరిపూర్ణముగ నింపు ||తనువు||
3. వెండిపసిడి యివిగో - వీసమైనను నాకై -
యుండవలెనని కోరను = నిండైన నీ యిష్ట నియమంబు
చొప్పున - మెండుగ వాడ బరి-మితియౌ జ్ఞానం బిదిగో ||తనువు||
4. నా యిష్ట మిదిగో యిది - నీ యిష్టముగ జేయ - నా
యిష్ట మిక గాదది = నా యిచ్ఛ యున్నట్టి - నా
హృదయమిదిగో నీ-కే యియ్యది రాజ-కీయ సింహాసనమౌ ||తనువు||
5. ఉన్న నా ప్రేమ నీ-సన్నిధానమున నే-నెన్నడు ధారవోయన్ =
నన్ను నీ వానిగ - నాధా గైకొను మెపుడు చెన్నుగ
నీ వశమై - స్థిరముగ నుండెద ||తనువు||
Tanuvu naadidigo gai-konumee yo prabhuvaa nee
Paniki bratishthinchumee = dinamulu kshanamulu
Deesikoni yavi needu - vinatin bravahimpa je -
yanu shaktineeyumee ॥tanuvu|
1. ghanamaina nee prema - kaaranambuna neekai - panijeyajetu
livigo = yanayambu nee vishaya-mai sogasugaa juruku -
danamuto barugetta - vinaya paadamu livigo ||tanuvu||
2. svaramidigo konumee - vararaaja ninu goorchi - niratammu
paadanimmu = mariyu pedavu livigo mahaneeyamaina
nee - parishuddha vaartato baripoornamuga nimpu ||tanuvu||
3. vendipasidi yivigo - veesamainanu naakai -
yundavalenani koranu = nindaina nee yishta niyamambu
choppuna - menduga vaada bari-mitiyau jnyaanam bidigo ||tanuvu||
4. naa yishta midigo yidi - nee yishtamuga jeya - naa
yishta mika gaadadi = naa yichchha yunnatti - naa
hrudayamidigo nee-ke yiyyadi raaja-keeya sinhaasanamau ||tanuvu||
5. unna naa prema nee-sannidhaanamuna ne-nennadu dhaaravoyan =
nannu nee vaaniga - naadhaa gaikonu mepudu chennuga
nee vashamai - sthiramuga nundeda ||tanuvu||
Comments
Post a Comment