ఒకనాడు పాపినై బ్రతికి
1. ఒకనాడు పాపినై బ్రతికి - ప్రియ యేసుని ప్రేమను మరచి
మనసు దేహము కోరినదే చేసి - మనశ్శాంతిని కోల్పోతిన్ (2)
లోకమందు శాంతి లేదుగా పాపజీవితం మాయారా (2)
దైవచిత్తం చేయుటే నా జీవితాశయం (2)
2. లోక స్నేహము అనిత్యం పగయేగా దాని స్వరూపం
లోక స్నేహము దేవునితో వైరం అని గ్రహించుటే సత్యం ॥లోక॥
3. సాతాను వలలో చిక్కి నా మనసును నే చెడగొట్టి
నిరాశ నన్ను పూర్తిగ ఆవరింప దిక్కు తెలియని వాడనైతి ॥లోక॥
4. నా యేసు ముఖమును చూచి నా పాపములకు క్షమ పొంది
రక్షణ కార్యము సఫలము చేయగా సంపూర్తిగ సమర్పించితి ॥లోక॥
5. తన ప్రేమతో నను నింపి తన సేవను చేయ పిలచి
మహిమలో చేర్చుకొను దినము వరకు నను దీనునిగా కాచున్ ॥లోక॥
1. okanaadu paapinai bratiki - priya yesuni premanu marachi
manasu dehamu korinade chesi - manashshaantini kolpotin (2)
lokamandu shaanti ledugaa paapajeevitam maayaaraa (2)
daivachittam cheyute naa jeevitaashayam (2)
2. loka snehamu anityam
pagayegaa daani svaroopam
loka snehamu devunito
vairam ani grahinchute satyan ॥loka॥
3. saataanu valalo chikki
naa manasunu ne chedagotti
niraasha nannu poortiga
aavarimpa dikku teliyani vaadanaiti ॥loka॥
4. naa yesu mukhamunu choochi
naa paapamulaku kshama pondi
Rakshana kaaryamu saphalamu
cheyagaa sampoortiga samarpinchiti ॥loka॥
5. tana premato nanu nimpi
tana sevanu cheya pilachi
mahimalo cherchukonu dinamu
varaku nanu deenunigaa kaachun ॥loka॥
Comments
Post a Comment