ఈలాటిదా యేసు ప్రేమ

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను
తూలనాడక - తనదు జాలి చూపినదా       ||ఈలాటిదా||

1.ఎనలేని పాప కూపమున – నేను
తనికి మిణుకుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు – వేగ
గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె        ||ఈలాటిదా||

2.పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను
మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
నను నీచుడని త్రోయలేక – తనదు
నెనరు నా కగుపరచి నీతి జూపించె         ||ఈలాటిదా||

3.నెమ్మి రవ్వంతైనా లేక – చింత
క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవ దలచి – కరము
జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె         ||ఈలాటిదా||

4.పనికిమాలిన వాడనైన – నేను
కనపరచు నా దోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత
ఘనమైన రక్షణ-మును నాకు చూపె         ||ఈలాటిదా||

5.నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది
లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు          ||ఈలాటిదా||

6. శోధనలు ననుఁ జుట్టినపుడు - నీతి బోధ నా
మనసులోఁ - బుట్టించి పెంచి = బాధ లెల్లను బాపి మాపి-
యిట్టి యాదరణఁజూపెనా యహహ యేమందు   ||ఈలాటిదా||   Eelaatidaa yesu prema -nannu Toolanaadaka - tanadu jaali choopinadaa ||eelaatidaa|| 1.enaleni paapa koopamuna – nenu Taniki minukuchunu ne dari gaanakundan Kanikaramu penchi naayandu – vega Gonipova naa melu korikindu vachche ||eelaatidaa|| 2.penugonna duhkhaabdhilona – nenu Munigi kumuluchu nedu punagundu napudu Nanu neechudani troyaleka – tanadu Nenaru naa kaguparachi neeti joopinche ||eelaatidaa|| 3.nemmi ravvantainaa leka – chinta Krammipogaluchu nunda-gaa nannu joochi Sammatini nanu brova dalachi – karamu Jaachi naa cheyi batti chakkagaa piliche ||eelaatidaa|| 4.panikimaalina vaadanaina – nenu Kanaparachu naa dosha kapatavartanamu Manasu nunchaka taapapadaka yinta Ghanamaina rakshana-munu naaku choope ||eelaatidaa|| 5.naa korkelella samayamulan – krindi Loka vaanchhala bhramasi longedu velan Chekoorchi dhrudamu chittamunan – shubhamu Naa kosange jeevimpa naa rakshakundu ||eelaatidaa|| 6. shodhanalu nanum juttinapudu - neeti bodha naa Manasulom - buttinchi penchi = baadha lellanu baapi maapi- Yitti yaadaranamjoopenaa yahaha yemandu ||eelaatidaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు