ఈ జీవితం విలువైనది
ఈ జీవితం విలువైనది -
నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు ||ఈ జీవితం||
1.సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం||
2.మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం||
3.పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||
Ee jeevitam viluvainadi -
Narulaaraa randani selavainadi (2)
Siddhapadinaavaa chivari yaatraku
Yugayugaalu devunito undutaku
neevundutaku ||ee jeevitan||
1.sampaadana kosame puttaledu neevu
Poyetappudu edee pattukoni povu (2)
Potunnavaarini nuvu chuchutaledaa (2)
Bratiki unna neeku vaaru paathame kaadaa (2) ||ee jeevitan||
2.maranamu ruchi choodaka bratike narudevadu
Kalakaalamee lokanlo unde sthirudevadu (2)
Chinna pedda tedaa ledu maranaaniki (2)
Kulamataalu addam kaadu smashaanaaniki (2) ||ee jeevitan||
3.paapulaku chotu ledu paralokamunandu
Anduke maarpuchendu maranaaniki mundu (2)
Yesu raktame nee paapaaniki mandu (2)
Kadagabadina vaarike gorrepilla vindu (2) ||ee jeevitan||
Comments
Post a Comment