ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా

ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా
ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా
నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా (2)
హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా
హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా   ||ఎందుకో||

1.నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు
పాతాళ వేదన శ్రమలనుండి
నన్ను విడిపించావు (2)         ||నీ కృపను||

2.నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు
నా గాయములను బాగు చేయ
నీవు శ్రమనొందావు (2)         ||నీ కృపను||

3.నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు
పరలోక పరిచర్య భాగస్వామిగా
నన్ను స్వీకరించావు (2)         ||నీ కృపను||

Enduko nannu neevu preminchaavu devaa E manchi leni naakai praanamichchaavu prabhuvaa Nee krupanu batti utsaahagaanamu chesedano devaa (2) Hallelooyaa yehova yeere – hallelooyaa yehova raaphaa Hallelooyaa yehova shaalom – hallelooyaa yehova shammaa ||enduko|| 1.naaku badulugaa naadu shikshanu neevu bhariyinchaavu Paataala vedana shramalanundi Nannu vidipinchaavu (2) ||nee krupanu|| 2.ne krungiyunna velalo neevu karuninchaavu Naa gaayamulanu baagu cheya Neevu shramanondaavu (2) ||nee krupanu|| 3.nee bandapaina naadu adugulu neevu sthiraparichaavu Paraloka paricharya bhaagasvaamigaa Nannu sveekarinchaavu (2) ||nee krupanu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు