నిబంధనా జనులం నిరీక్షణా ధనులం

నిబంధనా జనులం నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం
మేము నిబంధనల జనులం
యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే
మోక్షమందు చేరెదము (2)           ||నిబంధనా||

1.అబ్రాహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం (2)
మోషే బడిలో బాలురము (2)
యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

2.విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం (2)
వాక్యమే మా ఆహారం (2)
ప్రార్ధనే వ్యాయామం – అనుదినము
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

3.అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం (2)
పునరుత్తానుని పత్రికలం (2)
పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

4.నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం (2)
క్షమించుటే ఇల మా న్యాయం (2)
భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

5.క్రీస్తేసే మా భక్తికి పునాది పునరుత్తానుడే ముక్తికి వారధి (2)
పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2)
ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

6.ఎవరీ యేసుని అడిగేవో  ఎవరోలే యని వెళ్ళేవో (2)
యేసే మార్గం యేసే జీవం (2)
యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం
నిబంధనా జనులం           ||యేసు రాజు|| Nibandhanaa janulam nireekshanaa dhanulam Ghanudagu yesuni siluva raktapu sambandhulam Memu nibandhanala janulam Yesu raaju vachchunu – inkaa konta kaalame Mokshamandu cheredamu (2) ||nibandhanaa|| 1.abraahaamu neetiki vaarasulam aiguptu daatina anekulam (2) Moshe badilo baaluramu (2) Yesayya odilo krutaajnyulam – priya putrulam Memu nibandhanaa janulam ||yesu raaju|| 2.vishvaasame maa vedaantam nireekshane maa siddhaantam (2) Vaakyame maa aahaaram (2) Praardhane vyaayaamam – anudinamu Memu nibandhanaa janulam ||yesu raaju|| 3.ashesha prajalalo aastikulam akshayudesuni mudrikulam (2) Punaruttaanuni patrikalam (2) Parishuddhaatmuni gotrikulam – yaatrikulam Memu nibandhanaa janulam ||yesu raaju|| 4.najareyuni prema polimeralo sahinchute maa ghana niyamam (2) Kshaminchute ila maa nyaayam (2) Bharinchute maa saubhaagyam – ade paramaardham Memu nibandhanaa janulam ||yesu raaju|| 5.kreestese maa bhaktiki punaadi punaruttaanude muktiki vaaradhi (2) Parishuddhaatmude maa ratha saarathi (2) Prabhu yese maa pradhaana kaapari – bahu nerpari Memu nibandhanaa janulam ||yesu raaju|| 6.evaree yesuni adigevo evarole yani vellevo (2) Yese maargam yese jeevam (2) Yese satyam kaadu chodyam – ide maa saakshyam Nibandhanaa janulam ||yesu raaju||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు