నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల

నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా     ||నిరంతరం||

1.చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై  ||నిరంతరం||

2.నీ రూపము నేను కోల్పయినా నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై   ||నిరంతరం||

3.తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి (2)
నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

Nirantaram neetone jeevinchaalane aasha nannila bratikinchuchunnadi (2) Naa praaneshvaraa yesayyaa naa sarvasvamaa yesayyaa ||nirantaran|| 1.cheekatilo nenunnappudu nee velugu naapai udayinchenu (2) Neelone nenu velagaalani nee mahima naalo nilavaalani (2) Parishuddhaatma abhishekamuto nannu nimpuchunnaavu nee raakadakai ||nirantaran|| 2.nee roopamu nenu kolpayinaa nee raktamuto kadigitivi (2) Neetone nenu nadavaalani nee valene nenu maaraalani (2) Parishuddhaatma varamulato alankarinchuchunnaavu nee raakadakai ||nirantaran|| 3.tolakari varshapu jallulalo nee polamuloni naatitivi (2) Neelone chigurinchaalani neelone pushpinchaalani (2) Parishuddhaatma varshamuto siddhaparachuchunnaavu nee raakadakai ||nirantaran||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు