నేనెళ్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నేనెళ్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
అంతా నా మంచికే - తన చిత్తమునకు తలవంచితే
తన చిత్తమునకు తలవంచితే
ఆరాధన ఆపను - స్తుతించుట మానను (2)
స్తుతించుట మానను
1.కన్నీళ్లే ప్రాణములైన - కఠిన దుఃఖ బాధలైనా
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన (2)
మారదు యేసు ప్రేమ - నిత్యడైనా తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ll అంతా నా ll
2. ఆస్తులన్నీ కోల్పోయిన - కన్నవారే కనుమరుగైనా
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగును గాక (2) ll అంతా నా ll
3.అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర్లేదు (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కరలేదు (2) ll అంతా నా ll
4.ఆశలే సమాదీయైనా - వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
నాది మనస్సు నీ మీద - అనుకొనగా ఓ నాదా (2)
పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ll అంతా నా ll
5.చదువులే రాకున్నా - ఓటమిపాలైన
ఉద్యోగం లేకున్న - భూమికి బరువైనా (2)
నా యెడల నీ తలంపులు -ఎంతో ప్రియములు (2)
నీ ఉద్దేశించినది - నిచ్చలము కానేరదు (2) ll అంతా నా ll
6.సంకల్పన పిలుపొంది -నిన్నే ప్రేమించు
నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
అనుమతించిన ఈ విలువైన - సిలువకై(2) ll అంతా నా ll
7,నీవు చేయునది -నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలుసుకుందును (2)
ప్రస్తుతము సమస్తము - దుఃఖకరమే (2)
అభ్యసించిన నీతి - సమాధానఫలమే(2) ll అంతా నా ll Nenellappudu yehovaanu sannutinchedan Nityamu aayana keerti naa nota nundun (2) Antaa naa meluke - aaraadhana yesuke Antaa naa manchike - tana chittamunaku talavanchite Tana chittamunaku talavanchite Aaraadhana aapanu - stutinchuta maananu (2) Stutinchuta maananu 1.kanneelle praanamulaina - kathina duhkha baadhalainaa Sthitigatule maarina - avakaasham chejaarina (2) Maaradu yesu prema - nityadainaa tandri prema (2) Maaradu yesu prema - nityudaina tandri prema (2) ll antaa naa ll 2. aastulannee kolpoyina - kannavaare kanumarugainaa Oopiri baruvaina - gundele pagilinaa (2) Yehovaa ichchenu - yehovaa teesukonenu (2) Aayana naamamunake - stuti kalugunu gaaka (2) ll antaa naa ll 3.avamaanam entainaa - naa vaare kaadannaa Neevu tappa evarunnaaru aakaashamanduna (2) Neevu naakundagaa - edi naakakkarledu (2) Neevu naakundagaa - edi naakakkaraledu (2) ll antaa naa ll 4.aashale samaadeeyainaa - vyaadhi baadha velluvainaa Adhikaaram koppukoni - rakshanakai aanandintunu (2) Naadi manassu nee meeda - anukonagaa o naadaa (2) Poorna shaanti ne pondi - ninne ne keertintun (2) ll antaa naa ll 5.chaduvule raakunnaa - otamipaalaina Udyogam lekunna - bhoomiki baruvainaa (2) Naa yedala nee talampulu -ento priyamulu (2) Nee uddeshinchinadi - nichchalamu kaaneradu (2) ll antaa naa ll 6.sankalpana pilupondi -ninne preminchu Naaku samastamu samakoodi - melukai jarugunu (2) Yesuni saaroopyamu - nenu pondaalani (2) Anumatinchina ee viluvaina - siluvakai(2) ll antaa naa ll 7,neevu cheyunadi -naakippudu teliyadu Ika meedata nenu - telusukundunu (2) Prastutamu samastamu - duhkhakarame (2) Abhyasinchina neeti - samaadhaanaphalame(2) ll antaa naa ll
Comments
Post a Comment