నీవే నా సంతోషగానము రక్షణశృంగము

నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2)

బలశూరుడా యేసయ్యా నా తోడై

ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2)        ||నీవే నా||

1.త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2)  ||నీవే నా||

2.వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2)        ||నీవే నా||

3.నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2)        ||నీవే నా|| Neeve naa santoshagaanamu rakshanashrungamu mahaashailamu (2) Balashoorudaa yesayyaa naa todai Unnata sdhalamulapai nadipinchuchunnaavu (2) ||neeve naa|| 1.tyaagamu erugani snehamandu kshemamu karuvai yundagaa Nija snehitudaa praanamu petti nee premato nannaakarshinchinaavu (2) Nirantaram niluchunu naapai nee kanikaram Shodhanalainaa baadhalainanoo edurintu nee premato (2) ||neeve naa|| 2.vedana kaligina deshamandu vekuva velugai nilichinaavu Viduvaka todai abhivruddhiparachi aiguptulo sinhaasanamichchinaavu (2) Maaradu ennadoo neevichchina darshanam Anudinam anukshanam neeto naa jeevitam (2) ||neeve naa|| 3.nirjeevamaina ee loyayandu jeevaadhipativai velasinaavu Heenashareeram mahima shareeramuga nee vaakkuto mahaasainyamuga maarchinaavu (2) Hallelooyaa hallelooyaa neeve raaraajuvu Hosannaa hosannaa neeve maharaajuvu (2) ||neeve naa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు