నీ ప్రేమకు సాటి లేనే లేదు ప్రేమారూపా

నీ ప్రేమకు సాటి లేనే లేదు ప్రేమారూపా యేసురాజా (2)

నింగియందునా – నేల యందునా
పాతాళమందునా – ఎందైన గాని (2)
నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు         ||నీ ప్రేమకు||

1.పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు
నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు (2)
క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే         ||నీ ప్రేమకు||

2.ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా
ఇలలో నా సరివారు – త్రోసివేసినా (2)
ఇహమందు పరమందు నా ధనము నీవే     ||నీ ప్రేమకు|| Nee premaku saati lene ledu premaaroopaa yesuraajaa (2) Ningiyandunaa – nela yandunaa Paataalamandunaa – endaina gaani (2) Neekannaa adhikulu evaru lene leru ||nee premaku|| 1.paapinaina naa koraku – paralokam vidachinadevaru Naa paapamula korakai – siluvalo maraninchinadevaru (2) Kshamiyinchi rakshinchina naa tandri neeve ||nee premaku|| 2.dharaloni dhana dhaanyamulu – nannu veedinaa Ilalo naa sarivaaru – trosivesinaa (2) Ihamandu paramandu naa dhanamu neeve ||nee premaku||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు