యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా - రావేల ఓ యువకా
యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా - రావేల ఓ యువకా ! - రావేల ఓ యువతీ!!
అ.ప. నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభు జీవము నీదగును
1. దుర్దినములు రాకముందే - స్మరియించుము రక్షకుని
ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయకుమా ll నీ ll
2. నీ యవ్వన కాలమందే - ప్రభు కాడిని మోయుటచే
మేలొందెద నీవిపుడే జాగేలను యువజనమా ll నీ ll
3. గురిలేని నీ బ్రతుకు యెరయాయె విరోధికి
త్వరపడకుంటే నీకు - మరి తప్పదు నరకాగ్ని ll నీ ll
4. నీ దేహము దేవునిది - శుద్ధాత్మకు నిలయమది
ప్రభుకర్పణ చేయనిదే - పడగొట్టును అపవాది ll నీ ll
5. నశియించెడి లోకములో - వసియించవు కలకాలం
అసువులు బాసిన యేసు - బస చేరుము ఈ క్షణమే ll నీ ll
6. తన వనమున పనిచేయ - పనివారలు కావలెను
వినలేవా ప్రభు స్వరము - కనలేవా ప్రభు పొలము ll నీ ll
Yesu kreestu ninnu pilichenugaa - raavela o yuvakaa ! - raavela o yuvatee!!
A.pa. nee hrudayamu prabhukimmu - prabhu jeevamu needagunu
1. durdinamulu raakamunde - smariyinchumu rakshakuni
ghanamaina rakshananu nirlakshyamu cheyakumaa ll nee ll
2. nee yavvana kaalamande - prabhu kaadini moyutache
melondeda neevipude jaagelanu yuvajanamaa ll nee ll
3. gurileni nee bratuku yerayaaye virodhiki
tvarapadakunte neeku - mari tappadu narakaagni ll nee ll
4. nee dehamu devunidi - shuddhaatmaku nilayamadi
prabhukarpana cheyanide - padagottunu apavaadi ll nee ll
5. nashiyinchedi lokamulo - vasiyinchavu kalakaalam
asuvulu baasina yesu - basa cherumu ee kshaname ll nee ll
6. tana vanamuna panicheya - panivaaralu kaavalenu
vinalevaa prabhu svaramu - kanalevaa prabhu polamu ll nee ll
Comments
Post a Comment