యేసుని కొరకై యిల జీవించెద - భాసురముగ నే ననుదినము

యేసుని కొరకై యిల జీవించెద - భాసురముగ నే ననుదినము
దోసములన్నియు బాపెను మోక్ష - ని వాసమున ప్రభు జేర్చునుగా   ॥యేసుని॥


1. నాశనకరమగు గుంటలో నుండియు - మోసకరంబగు యూబినుండి
    నాశచే నిలపై కెత్తెను నన్ను పి - శాచి - పథంబున దొలగించెన్ ॥యేసుని॥


2. పలువిధముల పాపంబును జేసితి - వలదని ద్రోసితి
    వాక్యమును - కలుషము బాపెను కరుణను బిలిచెను - సిలువలో నన్నాకర్షించెను ॥యేసుని॥


3. అలయక సొలయక సాగిపోదును - వెలయగ నా ప్రభు మార్గములన్
    కలిగెను నెమ్మది కలువగిరిలో - విలువగు రక్తము చిందించిన ప్రభు  ॥యేసుని॥


4. శోధన బాధలు శ్రమలిల కల్గిన - ఆదుకొనును నా ప్రభువనిశం
    వ్యాధులు లేములు మరణము వచ్చిన - నాధుడె నా నిరీక్షణగున్ ॥యేసుని॥


5. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు - గుప్తమైయున్నవి ప్రభునందు
    అద్భుతముగ ప్రభు - వన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని ॥యేసుని॥


6. అర్పించెను దాన ప్రాణమునాకై - రక్షించెను నా ప్రియ ప్రభువు
    అర్పింతును నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప               ॥యేసుని॥


7. ప్రభునందానందింతును నిరతము - ప్రార్థన విజ్ఞాపనములతో
    విభుడే దీర్చును యిల నాచింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్  ॥యేసుని॥

8. యవ్వన జనమా యిదియే సమయము యేసుని చాటును రారండి
    పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్     ॥యేసుని॥


Yesuni korakai yila jeevincheda - bhaasuramuga ne nanudinamu 

Dosamulanniyu baapenu moksha - ni vaasamuna prabhu jerchunugaa   ॥yesuni॥


1. naashanakaramagu guntalo nundiyu - mosakarambagu yoobinundi 

    naashache nilapai kettenu nannu pi - shaachi - pathambuna dolaginchen ॥yesuni॥


2. paluvidhamula paapambunu jesiti - valadani drositi 

    vaakyamunu - kalushamu baapenu karunanu bilichenu - siluvalo nannaakarshinchenu ॥yesuni॥


3. alayaka solayaka saagipodunu - velayaga naa prabhu maargamulan 

    kaligenu nemmadi kaluvagirilo - viluvagu raktamu chindinchina prabhu  ॥yesuni॥


4. shodhana baadhalu shramalila kalgina - aadukonunu naa prabhuvanisham 

    vyaadhulu lemulu maranamu vachchina - naadhude naa nireekshanagun ॥yesuni॥


5. buddhi vijnyaana sarvasampadalu - guptamaiyunnavi prabhunandu 

    adbhutamuga prabhu - vanniyu nosagi diddunu naa bratukantatini ॥yesuni॥


6. arpinchenu daana praanamunaakai - rakshinchenu naa priya prabhuvu 

    arpintunu naa yaavajjeevamu rakshaku desuni sevimpa               ॥yesuni॥


7. prabhunandaanandintunu niratamu - praarthana vijnyaapanamulato 

    vibhude deerchunu yila naachintalu abhayamuto stutiyintu prabhun  ॥yesuni॥


8. yavvana janamaa yidiye samayamu yesuni chaatunu raarandi 

    paavana naamamu parishuddha naamamu jeevapu maargamu prachurimpan     ॥yesuni॥ 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో