స్తోత్రించెదను - స్తోత్రించెదను యేసు దేవుడా
స్తోత్రించెదను - స్తోత్రించెదను యేసు దేవుడా
మా జీవనాధా - ప్రేమనాధ స్తోత్రించెదను llస్తోత్రించెదనుll
1. ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని
యేడు దీపంబుల మధ్య - సంచరించువాడా llస్తోత్రించెదనుll
2.మొదటివాడా కడపటివాడా - మృతుడైనవాడా
మృతిని గెల్చి లేచినవాడా - మది నిను దలచెదను llస్తోత్రించెదనుll
3. వాడియైన రెండంచుల ఖడ్గము కలవాడా
పాడి నిన్ను భజియించెదము - పరమ పురివాస llస్తోత్రించెదనుll
4. అగ్నిజ్వాలలవంటి కన్నులు - కలిగినవాడా
అపరంజిని బోలిన పాదములు - దేవుని కుమార llస్తోత్రించెదనుll
5.ఏడు నక్షత్రములు - దేవుని ఏడాత్మలునూ
కలిగినవాడా కరుణించి మము - కాపాడుమయ్యా llస్తోత్రించెదనుll
6. దావీదు తాళపు చెవిని - బడసినవాడా
సత్య స్వరూపి పరిశుద్ధుండా - సంఘములకు కర్తా llస్తోత్రించెదనుll
7. ఆమెన్ అనువాడా- నమ్మకమైన నాధుండా
సత్యసాక్షి దేవుని సృష్టికి - ఆదియు నీవెగా llస్తోత్రించెదనుll
Stotrinchedanu - stotrinchedanu yesu devudaa
Maa jeevanaadhaa - premanaadha stotrinchedanu llstotrinchedanull
1. edu nakshatramulanu - kudicheta pattukoni
yedu deepambula madhya - sancharinchuvaadaa llstotrinchedanull
2.modativaadaa kadapativaadaa - mrutudainavaadaa
mrutini gelchi lechinavaadaa - madi ninu dalachedanu llstotrinchedanull
3. vaadiyaina rendanchula khadgamu kalavaadaa
paadi ninnu bhajiyinchedamu - parama purivaasa llstotrinchedanull
4. agnijvaalalavanti kannulu - kaliginavaadaa
aparanjini bolina paadamulu - devuni kumaara llstotrinchedanull
5.edu nakshatramulu - devuni edaatmalunoo
kaliginavaadaa karuninchi mamu - kaapaadumayyaa llstotrinchedanull
6. daaveedu taalapu chevini - badasinavaadaa
satya svaroopi parishuddhundaa - sanghamulaku kartaa llstotrinchedanull
7. aamen anuvaadaa- nammakamaina naadhundaa
satyasaakshi devuni srushtiki - aadiyu neevegaa llstotrinchedanull
Comments
Post a Comment