యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో
యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో ॥యేసుని॥
1. ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయు చుండెదరు
ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు ॥యేసుని॥
2. లెబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు
ప్రభు కృప జ్ఞానములో - ఎదుగుచు నుందురువారు ॥యేసుని॥
3. యెహోవా మందిరములో - నాటబడి యుండెదరు
సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు ॥యేసుని॥
4. దేవుని యావరణములో - వర్ధిల్లుచు నుండెదరు
సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు ॥యేసుని॥
5. వారు ముసలి తనంబున - చిగురు పెట్టి ఫలింతురు
ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు ॥యేసుని॥
6. నీటి కాలువ యోరను - నాటబడిన వారలై
మేటిసారమును కలిగి పచ్చగ నుందురు వారు ॥యేసుని॥
7. హల్లెలూయ పాట పాడి - వల్లభుని స్తుతింతురు
చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు ॥యేసుని॥
Yesuni nammedivaaru aayana uchita krupato ॥yesuni॥
1. kharjoorapu chettuvale - movvu veyu chundedaru
kharjoorapu mattalato - rakshanakai stutinchedaru ॥yesuni॥
2. lebaanonu devadaaru - chettuvale eduguduru
prabhu krupa jnyaanamulo - eduguchu nunduruvaaru ॥yesuni॥
3. yehovaa mandiramulo - naatabadi yundedaru
sahanamuto nilichedaru - kadalaka sthirulai yundedaru ॥yesuni॥
4. devuni yaavaranamulo - vardhilluchu nundedaru
sevinturu tama prabhuni - ghanaparaturu niratambu ॥yesuni॥
5. vaaru musali tanambuna - chiguru petti phalinturu
prasiddhi cheturu prabhuni - yathaarthavantudanuchu ॥yesuni॥
6. neeti kaaluva yoranu - naatabadina vaaralai
metisaaramunu kaligi pachchaga nunduru vaaru ॥yesuni॥
7. hallelooya paata paadi - vallabhuni stutinturu
challani prabhuraakadakai - mellagaa vechiyundedaru ॥yesuni॥
Comments
Post a Comment