సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను
సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము - నిత్య మెద రాజిల్లను
1. ముదముతో నిర్మాణకుండగు - మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వంచి దేవుని - వందనముతో వేడరే llసర్వll
2. వేదపారాయణము సేయుచు - విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ - స్వాంతమున బూజింపరే llసర్వll
3. ఎదను విశ్రాంతిన్ పరేశుని - హెచ్చుగా నుతిజేయరే
సదమలంబగు భక్తితో మీ సర్వమాయన కీయరే llసర్వll
4. చావు పుట్టుక లేనివాడుగ - సతతము జీవించును
ఈవు లిచ్చుచు దన్ను వేడు మ - హేష్టులను రక్షించునుllసర్వll
5. దాసులై దేవునికి నెదలో - దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము - నే మరక మైదాల్పరే llసర్వll
Sarvashaktuni stotragaanamu - salpare jagamellanu
Nirvahinchunu daasa bhaaramu - nitya meda raajillanu
1. mudamuto nirmaanakundagu - moola kartanu baadare
vadana meekshmaanvanchi devuni - vandanamuto vedare llsarvall
2. vedapaaraayanamu seyuchu - vishvamanta jayimpare
saadaramugaa devu nika mee - svaantamuna boojimpare llsarvall
3. edanu vishraantin pareshuni - hechchugaa nutijeyare
sadamalambagu bhaktito mee sarvamaayana keeyare llsarvall
4. chaavu puttuka lenivaaduga - satatamu jeevinchunu
eevu lichchuchu dannu vedu ma - heshtulanu rakshinchunullsarvall
5. daasulai devuniki nedalo - darpamunu bogaalpare
yesukreestuni punya vastramu - ne maraka maidaalpare llsarvall
Comments
Post a Comment