సాగెదన్ గురియొద్దకే పరమ గురి నాయేసువే
సాగెదన్ గురియొద్దకే పరమ గురి నాయేసువే
హిందూ దేశం నా జనం రక్షణలేక నశించెనే
1. పరిశుద్ధ హృదయము నీలో - ప్రభునేడు కోరెనుగా
దైవ కరములను నమ్మి - నీ చేతులను చాపు
పాప ఊబిలో పడనేల - దర్శనమును మరువనేల
పరిశుద్ధతకై వేడెదం - పందెమును జయించెదం llసాగెదన్ll
2. నా యేసు చూపిన ప్రేమ - తాను కార్చిన రక్తం
నిను సొంతముగ గెలువ - నిందను సహించెనుగా
ప్రేమ కెరటములేమాయె - నశించు నినివే ఎదుట నుండ
ప్రేమలో మనం యెదిగెదం - లోతులో వల వేసెదం llసాగెదన్ll
3. దైవ కోపం త్వరలో వచ్చున్ - దేశం బాధలు పొందున్
చేరుము ప్రభువు పాదం - ప్రార్థించు రాత్రంతా
నీలో ప్రార్ధన తగ్గనేల - పనులు ఎక్కువ అననేల
ఒలీవ శిఖరం చేరెదం - ఓపికతో ప్రార్థించెదం llసాగెదన్ll
Saagedan guriyoddake parama guri naayesuve
hindoo desham naa janam rakshanaleka nashinchene
1. parishuddha hrudayamu neelo -
prabhunedu korenugaa
daiva karamulanu nammi -
nee chetulanu chaapu
paapa oobilo padanela -
darshanamunu maruvanela
parishuddhatakai vededam -
pandemunu jayinchedam llsaagedanll
2. naa yesu choopina prema -
taanu kaarchina raktam
ninu sontamuga geluva -
nindanu sahinchenugaa
prema keratamulemaaye -
nashinchu ninive eduta nunda
premalo manam yedigedam -
lotulo vala vesedam llsaagedanll
3. daiva kopam tvaralo vachchun -
desham baadhalu pondun
cherumu prabhuvu paadam -
praarthinchu raatrantaa
neelo praardhana tagganela -
panulu ekkuva ananela
oleeva shikharam cheredam -
opikato praarthinchedam llsaagedanll
Comments
Post a Comment