మనకై యేసు మరణించె - మన పాపముల కొరకే
మనకై యేసు మరణించె - మన పాపముల కొరకే
నిత్య జీవము నిచ్చుటకే - సత్యుండు సజీవుడాయే
1.తృణికరింపబడే - విసర్జింపబడెను
దుఃఖక్రాంతుడాయె - వ్యసనములు భరించెను ॥మనకై॥
2.మన వ్యసనములు వహించెను మన దుఃఖముల భరించెను
మన మెన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి ॥మనకై॥
3.మన యతిక్రమముల కొరకు మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె llమనకైll
4.గొర్రెలవలె తప్పితిమి పరుగిడితిమి మన దారిన్
అరుదెంచే కాపరియై - అర్పించె ప్రాణమును ॥మనకై॥
5.దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
తన నోరు తెరువలేదు - మనకై క్రయధన మీయన్ llమనకైll
6. ఎదిరింపలే దెవరిన్ - లేదే కపటము నోట
యెహోవా నలుగ గొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్ ॥మనకై॥
7. సిలువలో వ్రేలాడెన్ సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్- స్తోత్రము హల్లెలూయ ॥మనకై॥ Manakai yesu maraninche - mana paapamula korake Nitya jeevamu nichchutake - satyundu sajeevudaaye 1.trunikarimpabade - visarjimpabadenu duhkhakraantudaaye - vyasanamulu bharinchenu ॥manakai॥ 2.mana vyasanamulu vahinchenu mana duhkhamula bharinchenu mana mennika cheyakaye mana mukhamula trippitimi ॥manakai॥ 3.mana yatikramamula koraku mana doshamula koraku Mana naathudu shikshanonde - manaku svasthata kalige llmanakaill 4.gorrelavale tappitimi parugiditimi mana daarin arudenche kaapariyai - arpinche praanamunu ॥manakai॥ 5.daurjanyamu nondenu - baadhimpabadenu tana noru teruvaledu - manakai krayadhana meeyan llmanakaill 6. edirimpale devarin - lede kapatamu nota yehovaa naluga gotten - mahaavyaadhini kaliginchen ॥manakai॥ 7. siluvalo vrelaaden samaadhilo nundenu sajeevundai lechen- stotramu hallelooya ॥manakai॥
Comments
Post a Comment