యేసు నాదు కాపరి వాని - వాసిగా స్తుతించెదన్
యేసు నాదు కాపరి వాని - వాసిగా స్తుతించెదన్
యేసు గొట్టెపిల్లను – పోయెదను తనవెంట
1. పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్ - స్వచ్ఛ జలముల చెంత
నిచ్చును విశ్రాంతి - ముందు ముందు వెళ్లుచు పొందుగ రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబు నా - తనివి దీర్చును ॥యేసు||
2. మరణలోయ ద్వారా - సరిగా నడిపించును - అడవి భయములెల్ల
ఎడబాపి రక్షించున్ - హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును
వింతగువాని ప్రేమ సేవలో సంతోషింతును ||యేసు||
3. శత్రుముందాహారం - సంసిద్ధం జేయును - నాగిన్నె నిండించి
పొర్లి పారజేసి - కడిగి కడిగి - శుద్ధిచేసి ఆత్మ దానమిచ్చెను
వడిగా వాని సాయమున - జయమున వెళ్లెదను ॥యేసు॥
Yesu naadu kaapari vaani - vaasigaa stutinchedan
Yesu gottepillanu – poyedanu tanaventa
1. pachchika patlaku - machchikato nadupun - svachchha jalamula chenta
nichchunu vishraanti - mundu mundu velluchu ponduga rakshinchu nannu
tana maadhurya svarambu naa - tanivi deerchunu ॥yesu||
2. maranaloya dvaaraa - sarigaa nadipinchunu - adavi bhayamulella
edabaapi rakshinchun - hatti otti katti gaayaalento aadarinchunu
vintaguvaani prema sevalo santoshintunu ||yesu||
3. shatrumundaahaaram - sansiddham jeyunu - naaginne nindinchi
porli paarajesi - kadigi kadigi - shuddhichesi aatma daanamichchenu
vadigaa vaani saayamuna - jayamuna velledanu ॥yesu॥
Comments
Post a Comment