సంతోషించుడి – అందరు నాతో - సంతోషించుడి

సంతోషించుడి – అందరు నాతో - సంతోషించుడి
యొక = వింతగు కీర్తన పాడ వచ్చితిని - సంతోషించండి నాతో


1. అంధకార మయమైన భూమినా - ద్యంతము
    వెలిగింప - దాని యా - వేశము దొలగింప
  వందితుండు క్రీస్తేసు నాధుడు - వచ్చె బ్రకా
  శుండై - భూమికి - నిచ్చె ప్రకాశంబు ॥సంతో॥


2. కాన నంధకారంబు దొలగ ప్ర - కాశించెను లెండు
    మీరు ప్ర - కాశింపను రండు = మానవులను సంతోషపర్చనై
    మహిని నవతరించె - భక్తుల-మనము సంతసించె ॥సంతో॥

3. మిన్ను నుండి సంతోషోదయము - మిగుల ప్రకాశించె
    హృదయముల - దగుల ప్రకాశించె = మున్ను జేయబడిన
    వాగ్దత్తము - తిన్నగ నెరవేరె భక్తుల - కన్ను లాసదీరె ॥సంతో॥


4. ప్రీతియైన నీ పండుగ గూర్చి- నూతన కీర్తనను - గలసికొని
    నాతో పాడుచును = నీ తరి దూరస్థుల కీవార్తను - నే తీరున
    నైన - దెలుపగ - నాతురపడవలెను     ॥సంతో॥


5. పాపులపై దేవునికి గలిగిన - ప్రబలమైన దయను
    లోకమున -జూపింపగవలెను = జూపకపోయిన లోపము
    మనపై - మోపబడును నిజము - వేగము - జూపు మాపథము   ॥సంతో॥


Santoshinchudi – andaru naato - santoshinchudi 

Yoka = vintagu keertana paada vachchitini - santoshinchandi naato


1. andhakaara mayamaina bhoominaa - dyantamu 

    veligimpa - daani yaa - veshamu dolagimpa 

   vanditundu kreestesu naadhudu - vachche brakaa

   shundai - bhoomiki - nichche prakaashambu ॥santo॥


2. kaana nandhakaarambu dolaga pra - kaashinchenu lendu 

    meeru pra - kaashimpanu randu = maanavulanu santoshaparchanai 

    mahini navatarinche - bhaktula-manamu santasinche ॥santo॥


3. minnu nundi santoshodayamu - migula prakaashinche 

    hrudayamula - dagula prakaashinche = munnu jeyabadina 

    vaagdattamu - tinnaga neravere bhaktula - kannu laasadeere ॥santo॥


4. preetiyaina nee panduga goorchi- nootana keertananu - galasikoni 

    naato paaduchunu = nee tari doorasthula keevaartanu - ne teeruna 

    naina - delupaga - naaturapadavalenu     ॥santo॥


5. paapulapai devuniki galigina - prabalamaina dayanu 

    lokamuna -joopimpagavalenu = joopakapoyina lopamu 

    manapai - mopabadunu nijamu - vegamu - joopu maapathamu   ॥santo॥ 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు