సిలువే నా శర ణాయెను - రా

సిలువే నా శర ణాయెను - రా - నీ సిలువే నా శర ణాయెను రా
సిలువయందే ముక్తి బలము జూచితిరా           llసిలువేll


1. సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు
    విలువలేని ప్రేమామృతము - గ్రోలితి రా      llసిలువేll


2. సిలువను జూచుకొలది - శిల సమానమైన మనసు

    నలిగి, కరిగి నీరగుచున్నది రా     llసిలువేll


3.సిలువను దరచి తరచితి - విలువ కందగరాని నీ కృప

   కలుషమెల్లను బాపగ - జాలును రా     llసిలువేll


4. పలువిధ పథములరసి - ఫలితమేమి గానలేక
    సిలువ యెదుటను - నిలచి నాడను రా     llసిలువేll


5. శరణు యేసు శరణు శరణు - శరణు శరణు
    నా ప్రభువా - దురిత దూరుడ - నీ దరిజేరితి రా   llసిలువేll


Siluve naa shara naayenu - raa -
nee siluve naa shara naayenu raa 

Siluvayande mukti balamu joochitiraa           llsiluvell


1. siluvanu vraali yesu - palikina palukulandu 

    viluvaleni premaamrutamu - groliti raa      llsiluvell


2. siluvanu joochukoladi - shila samaanamaina manasu

    naligi, karigi neeraguchunnadi raa     llsiluvell


3.siluvanu darachi tarachiti - viluva kandagaraani nee krupa

   kalushamellanu baapaga - jaalunu raa     llsiluvell


4. paluvidha pathamularasi - phalitamemi gaanaleka 

    siluva yedutanu - nilachi naadanu raa     llsiluvell


5. sharanu yesu sharanu sharanu - sharanu sharanu 

    naa prabhuvaa - durita dooruda - nee darijeriti raa   llsiluvell


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు